Header Banner

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో 77 మంది ఐపీఎస్‌ల బదిలీ!

  Mon May 19, 2025 21:53        Politics

రాష్ట్ర పోలీసు యంత్రాంగంలో సోమవారం భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. డీజీపీ జితేందర్ కీలక ఉత్తర్వులు జారీ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 77 మంది డీఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను బదిలీ చేశారు. ఈ బదిలీల ప్రక్రియలో భాగంగా కొందరికి నూతన పోస్టింగులు కేటాయించగా, మరికొందరిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. పోలీసు శాఖలో పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ బదిలీల్లో పలువురు కీలక అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. జగిత్యాల సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవో)గా ఎన్. వెంకటస్వామి నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ విభాగం డీఎస్పీగా డి. రఘుచందర్‌కు బాధ్యతలు అప్పగించారు.

 

ఇది కూడా చదవండి: సీఎం చంద్రబాబుకు బిల్‌గేట్స్ లేఖ..! ఎందుకంటే?

 

హైదరాబాద్ నగరంలోని కీలక ప్రాంతాల్లో కూడా మార్పులు జరిగాయి. బాలానగర్ ఏసీపీగా పి. నరేశ్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా వి. శ్రీకాంత్ గౌడ్, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్, చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్ శ్రీకాంత్‌లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేవిధంగా, మేడ్చల్ ఏసీపీగా సీహెచ్ శంకర్ రెడ్డి, సంతోష్ నగర్ ఏసీపీగా సుఖ్‌దేవ్ సింగ్, మలక్‌పేట ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, హుస్నాబాద్ ఏసీపీగా సదానందం, హైదరాబాద్ గాంధీనగర్ ఏసీపీగా ఏ. యాదగిరి బదిలీ అయ్యారు. కొంతమంది అధికారులను ప్రస్తుత స్థానాల నుంచి బదిలీ చేసి, డీజీపీ కార్యాలయంలో తక్షణమే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. వీరిలో చిక్కడపల్లి ఏసీపీగా పనిచేస్తున్న ఎల్. రమేశ్ కుమార్, మేడ్చల్ ఏసీపీ బి. శ్రీనివాస్ రెడ్డి, సంతోష్‌నగర్ ఏసీపీ ఎండీ గౌస్, మలక్‌పేట ఏసీపీ జి. శ్యామ్ సుందర్, హుస్నాబాద్ ఏసీపీ వి. సతీశ్‌లు ఉన్నారు. ఈ బదిలీలు పోలీసు శాఖలో సాధారణ పరిపాలన ప్రక్రియలో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నారా రోహిత్​పై కిడ్నాప్​ ఆరోపణలు! సీఎంకు కంప్లైంట్​ చేస్తానన్న మంచు మనోజ్!

 

శ్రీశైలం ఆలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్పై వేటు! ఘటన వెలుగులోకి రావడంతో..

 

బాంబు పేలుళ్ల కుట్ర భగ్నం..! వెలుగులోకి సంచలన విషయాలు!

 

ఏపీలో త్వరలోనే నంది అవార్డులు! సినిమాలతో పాటు నాటక రంగానికి..!

 

అమెరికా ప్రయాణికుల‌కు కీలక హెచ్చరిక! గడువు దాటితే తీవ్ర పరిణామాలు! శాశ్వత నిషేధం కూడా..

 

హర్భజన్ పై మండిపడుతున్న కోహ్లీ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో దుమారం!

 

గుల్జార్‌హౌస్‌ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై స్పందించిన మోదీ, ఏపీ సీఎం! మృతుల కుటుంబాల‌కు ప‌రిహారం ప్ర‌క‌ట‌న‌!

 

ఏపీలో సీనియర్ సిటిజన్లకు బంపరాఫర్.. సర్కార్ కీలక నిర్ణయం! వాట్సాప్ ద్వారానే - అస్సలు మిస్ కాకండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices